బొగ్గు రంగంలో భారతదేశం ఆత్మనిర్భరత సాధించే దిశగా ముందుకెళ్తోందని కేంద్ర బొగ్గు, గనుల శాఖ మంత్రి కిషన్ రెడ్డి తెలిపారు. ఈ విషయంలో మరింత సానుకూల ఫలితాలు సాధించేందుకు బొగ్గు దిగుమతుల మీద ఆధారపడకుండా.. దేశీయంగా ఉత్పత్తిని పెంచేందుకు కృషిచేయాలని కిషన్ రెడ్డి సూచించారు. శుక్రవారం కోల్‌కతాలో సీఐఎల్ (కోల్ ఇండియా లిమిటెడ్) కేంద్ర కార్యాలయాన్ని సందర్శించిన కేంద్రమంత్రి.. అనంతరం ఉద్యోగులు, ఉన్నతాధికారులతో ఏర్పాటుచేసిన సమావేశంలో మాట్లాడారు. భారతదేశం బొగ్గు రంగంలో సాధిస్తున్న ప్రగతిలో సీఐఎల్ కీలకపాత్ర…