BYJU’s: ఎవరినీ కాపీ కొట్టకుండా మన స్టైల్లో కొత్త కంపెనీని ప్రారంభించి, విజయవంతంగా వృద్ధిలోకి తీసుకురావటం అంత ఈజీ కాదని బైజూస్ కో-ఫౌండర్ దివ్యా గోకుల్‌నాథ్ అన్నారు. ఎడ్‌టెక్ సంస్థలకు ఈమధ్య ఎదురవుతున్న సవాళ్ల గురించి అడిగిన ప్రశ్నకు ఆమె ఈ విధంగా సమాధానం చెప్పారు. బైజూస్ ప్రారంభమైనప్పుడు అది కేవలం ఒక యాప్ మాత్రమేనని, ఇప్పుడు అనూహ్యంగా విస్తరించిందని చెప్పారు.