Wealth of CMs: భారత రాజకీయాలు డబ్బుతో ముడిపడి ఉంటాయనేది కాదనకూడని నిజం. సాధారణంగా గ్రామస్థాయిలో ఉన్న ప్రజాప్రతినిధులు ఎంపీటీసీ, జెడ్పీటీసీలే ఒక్కసారి అధికారం వస్తే కోట్లకు పడగతెత్తుతున్నారు. అలాంటిది సీఎం అయితే కోట్ల ఆస్తులు ఉండటం చాలా సహజం. అయితే భారతదేశంలో మొత్తం 30 మంది సీఎంలలో 29 మంది కోటీశ్వరులే అని అంటే 97 శాతం మంది కోటీశ్వరులే అని అసోసియేషన్ ఫర్ డెమోక్రటిక్ రిఫార్మ్స్ (ADR) వెల్లడించింది.