జగన్ మార్క్.. ప్రతి ఇంట్లో.. ప్రతీ గ్రామంలో కనిపిస్తుంది.. జగన్ కి పేదలపై ఉన్నంత ప్రేమ.. దేశంలో ఏ నాయకుడికి లేదు, ఉండదు అన్నారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత, ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్‌రెడ్డి.. జగన్ చేయలేని స్కీంలు.. చంద్రబాబు ఆయన బాబు కూడా చేయలేడని పేర్కొన్నారు.
ఆంధ్రప్రదేశ్ అప్పుల ఊబిలో కూరుకుపోయిందని ఆరోపించారు.. ఇప్పటి వరకు వైసీపీ ప్రభుత్యం 13 లక్షలు కోట్ల రూపాయల అప్పులు ఉన్నాయి.. ఒక్కోక్కరి తలపై 2 లక్షల రూపాయల అప్పు ఉంటుందని సంచలన ఆరోపణలు చేశారు కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్
ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై రాయి దాడి కేసులో నిందితుడు సతీష్‌ను కస్టడీకి ఇచ్చేందుకు కోర్టు అనుమతించింది. సీఎం జగన్‌పై దాడి కేసులో సతీష్‌ను మూడు రోజుల పోలీస్ కస్టడీకి ఇస్తూ న్యాయస్థానం ఉత్తర్వులు జారీ చేసింది.
రేపు పులివెందులలో ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి నామినేషన్ దాఖలు చేయనున్నారు. మొదట సిద్ధం సభలు, ఆ తర్వాత మేమంతా సిద్ధం పేరిట రాష్ట్ర వ్యాప్తంగా బస్సు యాత్రలు చేపట్టిన వైసీపీలో ఫుల్‌జోష్ కనపడుతోంది. ఈ జోష్‌లోనే నామినేషన్ దాఖలు చేయనున్నారు.
వై నాట్ 175 టార్గెట్‌గా ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి చేపట్టిన బస్సు యాత్ర నేటితో ముగియనుంది. సాయంత్రం అక్కవరం సభ తర్వాత తాడేపల్లికి చేరుకోనున్నారు సీఎం జగన్. రేపు(ఏప్రిల్ 25) పులివెందులలో నామినేషన్ వేస్తారు. సిద్ధం, మేమంతా సిద్ధం తరహాలోనే.. మరో విడత ప్రచారానికి కూడా వైసీపీ నేతలు ప్రణాళిక సిద్ధం చేశారు.