ఇప్పటికే ఆంధ్రప్రదేశ్‌ను భారీ వర్షాలు, వరదలు అతలా కుతలం చేశాయి.. మరోసారి భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయన్న వాతావరణశాఖ హెచ్చరికలు కలవరపెడుతున్నాయి.. దీంతో.. అప్రమత్తం అవుతోంది ఏపీ సర్కార్.. ముఖ్యంగా నెల్లూరుతో పాటు రాయలసీమ జిల్లాలపై వీటి ప్రభావం ఎక్కువగా ఉండడంతో… ఇవాళ ఉదయం 11 గంటలకు చిత్తూరు, కడప, నెల్లూరు, అనంతపురం జిల్లాలకు చెందిన కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించనున్నారు సీఎం వైఎస్ జగన్.. మరోవైపు.. ఇప్పటికే తుఫాన్ మిగిల్చిన నష్టంపై కేంద్ర…
కనీస మద్దతు ధర చట్టం తీసుకురావాలని కోరినట్టు వెల్లడించారు వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్లమెంటరీ పార్టీ నేత విజయసాయిరెడ్డి… ఢిల్లీలో మీడియాతో మాట్లాడిన ఆయన.. కనీస మద్దతు ధరను 24 పంటలకు మా ముఖ్యమంత్రి వైఎస్ జగన్ కల్పిస్తున్నారని గుర్తుచేశారు.. అదే పద్ధతిలో దేశవ్యాప్తంగా అన్ని పంటలకు మద్దతు ధర ఇవ్వాలని డిమాండ్ చేశారు.. ఇక, ఆహార భద్రతా చట్టం అమలులో రాష్ట్రానికి అన్యాయం జరిగిందని.. దానిని సరిదిద్దాలని సూచించారు. అణగారిన బీసీలను గుర్తించేందుకు సామాజిక ఆర్థిక కుల…
పార్లమెంట్ శీతాకాల సమావేశాలు ప్రారంభం అవుతోన్న తరుణంలో లోక్‌సభ, రాజ్యసభలో అనుసరించాల్సిన వ్యూహం, లేవనెత్తాల్సిన అంశాలపై పార్టీ ఎంపీలకు దిశానిర్దేశం చేశారు వైసీపీ అధినేత, ఏపీ సీఎం వైఎస్ జగన్.. సచివాలయంలో పార్టీ ఎంపీలతో సమావేశమైన ఆయన.. పార్లమెంట్ లో అనుసరించాల్సిన వ్యూహాలపై ఎంపీలకు మార్గ నిర్దేశం చేశారు.. ఎంపీలకు సీఎం వైఎస్ జగన్ సూచనలు: పోలవరం ప్రాజెక్టు సవరించిన అంచనాల రూ. 55,657 కోట్ల ఆమోదానికి కృషి చేయాలి. జాతీయ హోదా ప్రాజెక్టు అంటే విద్యుత్తు,…
ముఖ్యమంత్రి అయ్యేవరకూ అసెంబ్లీకి రాను అంటూ శాసనసభ నుండి వాకౌట్ చేసి వెళ్లిపోయారు ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడు.. అయితే, దీనిపై అధికార పార్టీ నేతలు సెటైర్లు వేస్తూనే ఉన్నారు.. తాజాగా ఈ వ్యవహారంపై స్పందించిన ప్రభుత్వ చీఫ్ విప్ గడికోట శ్రీకాంత్ రెడ్డి.. కుప్పం ఓటమిని డైవర్ట్ చేయడం కోసమే అయన అసెంబ్లీ నుంచి పారిపోయాడని ఎద్దేవా చేశారు.. వ్యక్తిత్వం ఇప్పటికే దిగజార్చుకున్న చంద్రబాబు ఇప్పటికైనా మారాలని సూచించిన ఆయన.. భారీ వర్షాలు, వరదలతో జరిగిన…
పార్లమెంట్ శీతాకాల సమావేశాలు ప్రారంభం కానున్న నేపథ్యంలో వైసీపీ పార్లమెంటరీ పార్టీ సమావేశాన్ని నిర్వహించేందుకు సిద్ధం అయ్యారు పార్టీ అధినేత, ఏపీ సీఎం వైఎస్ జగన్… రేపు వైసీపీ పార్లమెంటరీ పార్టీ భేటీ జరగనుంది… రేపు మధ్యాహ్నం 2 గంటల ప్రాంతంలో వైసీపీ లోక్‌సభ, రాజ్యసభ ఎంపీలతో సమావేశం కానున్నారు సీఎం వైఎస్ జగన్.. ఈ నెల 29వ తేదీ నుంచి పార్లమెంట్ శీతాకాల సమావేశాలు ప్రారంభం కానున్న నేపథ్యంలో.. జరుగుతోన్న ఈ భేటీలో.. పార్లమెంట్‌లో లేవనెత్తాల్సిన…
ఆంధ్రప్రదేశ్‌లో ఏ ఎన్నికలు జరిగినా వార్ వన్ సైడే అంటూ ఇప్పటికే పలు సందర్భాల్లో వైసీపీ నేతలు వ్యాఖ్యలు చేశారు.. ఇప్పటికే ఉప ఎన్నికలు, స్థానిక సంస్థల ఎన్నికలు, వాటికి జరిగిన బై పోల్ ఇలా అన్నింటిలోనూ అధికార వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీదే పై చేయి.. ఇక, ఎమ్మెల్సీ స్థానాల్లోనూ ఆ పార్టీ హవాయే కొనసాగుతోందని చెప్పాలి.. స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల నామినేషన్ పరిశీలన ప్రక్రియ ఇవాళ పూర్తి అయ్యింది.. 11 ఎమ్మెల్సీ స్థానాలు ఏకగ్రీవం…
ఏపీ రాజధానిపై సీఎం వైఎస్ జగన్ కీలక ప్రకటన చేసింది. రాజధానల వికేంద్రీకరణ బిల్లు ఆమోదం పొందిన వెంటనే మూడు ప్రాంతాలకు న్యాయం చేసేలా మూడు రాజధానుల ప్రక్రియ ప్రారంభమై ఉంటే ఈరోజుకు మంచి ఫలితాలు ఉండేవని, నాటి శ్రీభాగ్ ఒడంబడిక స్పూర్తితో వెనకబడ్డ ఉత్తరాంధ్ర సహా అన్ని ప్రాంతాలు కూడా సమాన అభివృద్ది చెందాలన్న అకాంక్షతో వికేంద్రీకరణ బిల్లుల్ని ప్రవేశపెట్టినట్టు సీఎం వైఎస్ జగన్ తెలిపారు. Read: అన్ని సంస్థలు ఒకేచోట పెడితే ఏప్రాంతం అభివృద్ది…
అస్వస్థతకు గురై హైదరాబాద్ వచ్చి ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న ఏపీ గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్‌ను మరోసారి పరామర్శించారు సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి.. ప్రస్తుతం ఏపీ అసెంబ్లీ సమావేశాలు కొనసాగుతుండగా.. శాసనసభ విరామ సమయంలో గవర్నర్‌ను ఫోన్‌లో పరామర్శించిన సీఎం.. ఆయన ఆరోగ్య పరిస్ధితిపై ఆరా తీశారు.. నిన్ననే వైద్యులతో ఆరోగ్య పరిస్థితిపై మాట్లాడానని.. సరైన సమయంలో ఆస్పత్రిలో చేర్చినట్లు వైద్యులు చెప్పారనే విషయాన్ని గుర్తు చేసుకున్నారు.. త్వరగా కోలుకోవాలని ఆకాంక్షిస్తున్నట్లు తెలిపారు సీఎం వైఎస్ జగన్.…
ఆంధ్రప్రదేశ్‌లో బుధవారం వెలువడిన మున్సిపల్ ఎన్నికల ఫలితాల్లో అధికార వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ సత్తా చాటింది… ఇక, మంగళవారం పోలింగ్ జరిగిన 10 జెడ్పీటీసీ, 123 ఎంపీటీసీ స్థానాలకు సంబంధించిన ఓట్లను ఇవాళ లెక్కించనున్నారు.. ఉదయం 8 గంటలకు ఓట్ల లెక్కింపు ప్రారంభమవుతుందని రాష్ట్ర ఎన్నికల కమిషన్ కార్యాలయం వెల్లడించింది.. ఎంపీటీసీ స్థానాల ఫలితాలు ఉదయం 10 గంటల కల్లా తేలిపోనుండగా.. జెడ్పీటీసీ స్థానాల్లో మధ్యాహ్నం 12 గంటలకల్లా తుది ఫలితం వెలువడే అవకాశాలున్నాయి.. అయితే, నిన్నటి…
ఏపీలో జరిగిన స్థానిక సంస్థల ఎన్నికల్లో వైసీపీ సత్తా చాటింది.. టీడీపీ డీలాపడిపోగా.. వైసీపీ శ్రేణులు సంబరాల్లో మునిగిపోయాయి… ఈ ఫలితాలపై స్పందించిన వైసీపీ ఎమ్మెల్యే ఆర్కే రోజా.. ఏ ఎన్నికలు వచ్చినా వార్ వన్‌సైడే అన్నారు.. ఈ ఎన్నికల్లో నలబై ఏళ్ల ఇండ్రస్టీ అయినా చంద్రబాబుని తరిమి కొట్టారని సెటైర్లు వేసిన ఆమె.. కుప్పంలోనే ఇల్లు లేని చంద్రబాబును… హైదరాబాదు ఇంటికి పరిమితం చేశారని వ్యాఖ్యానించారు… ఇకనైనా చంద్రబాబు, లోకేష్ నోరు అదుపులో పెట్టుకుంటే మంచిదని…