ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఇవాళ విశాఖ జిల్లాలో పర్యటించనున్నారు.. ఉదయం 9 గంటలకు తాడేపల్లి నుంచి బయల్దేరనున్న ఆయన.. తిరిగి మధ్యాహ్నం 3 గంటలకు తన నివాసానికి చేరుకోనున్నారు.. తన పర్యటనలో ముఖ్యంగా జపాన్‌కు చెందిన ప్రముఖ టైర్ల తయారీ సంస్థ యకహోమా గ్రూప్ అనకాపల్లి జిల్లా అచ్యుతాపురం సెజ్‌లో నెలకొల్పిన అలయన్స్ టైర్స్ కంపెనీ (ఏటీసీ) యూనిట్‌ను లాంఛనంగా ప్రారంభించనున్నారు సీఎం.. సుమారు రూ.2,200 కోట్ల పెట్టుబడి అంచనాతో రెండు దశల్లో ఇది…