CM Revanth Reddy: హైదరాబాద్‌తో పాటు తెలంగాణ వ్యాప్తంగా పలు జిల్లాలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తున్నాయి.. ముఖ్యంగా హైదరాబాద్, పరిసర ప్రాంతాల్లో రాత్రి నుంచి ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షంతో.. లోతట్టు ప్రాంతాల వారు.. వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడాల్సిన పరిస్థితి వచ్చింది.. అయితే, రాష్ట్రంలో భారీ వర్షాలపై ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహించారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి.. భారీ వర్షాల నేపథ్యంలో అధికారులు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.. లోతట్టు…
హైదరాబాద్ మెట్రో రైల్ పై కీలక పరిణామం చోటుచేసుకుంది. హైదరాబాద్ మెట్రో నుండి ఎల్ ఎండ్ టి తప్పుకున్నది. తెలంగాణ ప్రభుత్వం, ఎల్&టీ సీఎండీకి మధ్య ఒప్పందం కుదిరింది. ఇకపై తెలంగాణ ప్రభుత్వం చేతిలోకి హైదరాబాద్ మెట్రో రైల్. ప్రభుత్వమే నిర్వహించేందుకు నిర్ణయం తీసుకుంది. ఉదయం మెట్రో అధికారులతో సీఎం రేవంత్ భేటి అయ్యారు. మెట్రో రైల్ నెట్వర్క్ పొడవు పరంగా 2014లో దేశంలో రెండవ స్థానంలో ఉన్న హైదరాబాద్ ఇప్పుడు దేశంలో 9వ స్థానానికి పడిపోయింది.ఎల్&టీ…
కాపీరైట్ కేసులో ఊరట గ్రామీ, ఆస్కార్ విజేత మ్యూజిక్ మాస్ట్రో ఏఆర్ రహ్మాన్‌కు ఢిల్లీ హైకోర్టు నుంచి పెద్ద ఊరట లభించింది. 2023లో మణి రత్నం డైరెక్టర్‌గా ‘పొన్నియిన్ సెల్వన్ 2’ సినిమాలోని ‘వీర రాజా వీర’ పాటపై వచ్చిన కాపీరైట్ ఉల్లంఘన కేసులో సింగిల్ జడ్జి బెంచ్ జారీ చేసిన ఆర్డర్‌ను డివిజన్ బెంచ్ రద్దు చేసింది. జస్టిస్‌లు సి. హరి శంకర్, ఓం ప్రకాశ్ శుక్లా ఉన్న ఈ బెంచ్, రహ్మాన్ అప్పీల్‌ను అనుమతించడంతో పాటు,…
రాష్ట్ర హోదా కల్పించాలని లడఖ్‌లో నిరసనలు.. బీజేపీ ఆఫీస్ దగ్ధం రాష్ట్ర హోదాను డిమాండ్ చేస్తూ లడఖ్‌లో నిరసనకారులు పెద్ద ఎత్తున ఆందోళనకు దిగారు. బుధవారం బంద్‌కు పిలుపునిచ్చారు. దీంతో నిరసనకారులు పెద్ద ఎత్తున రోడ్లపైకి వచ్చి నిరసనలు చేపట్టారు. దీంతో నిరసనకారులకు పోలీసుల మధ్య ఘర్షణ చోటుచేసుకుంది. పోలీస్ వాహనాలను ఆందోళనకారులు తగలబెట్టారు. అలాగే బీజేపీ కార్యాలయానికి కూడా నిప్పుపెట్టారు. ఇందుకు సంబంధించిన దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. బుధవారం ఉదయం లడఖ్‌లోని లేహ్…
లారెన్స్ బిష్ణోయ్ ‘‘దేశద్రోహి’’.. గ్యాంగ్‌స్టర్ రోహిత్ గోదారా సంచలన వ్యాఖ్యలు.. ఇద్దరు గ్యాంగ్స్టర్స్, రెండు గ్యాంగుల మధ్య వార్ ఇప్పుడు సంచలనంగా మారింది. గ్యాంగ్‌స్టర్ రోహిత్ం గోదారా, మరో గ్యాంగ్‌స్టర్ లారెన్స్ బిష్ణోయ్‌ని ‘‘దేశద్రోహి’’గా ఆరోపించాడు. బిష్ణోయ్ అమెరికా ఏజెన్సీతో కుమ్మక్కయ్యాడని, సున్నితమైన సమాచారాన్ని ఇస్తున్నట్లు వెల్లడించారు. ధ్రువీకరించని ఓ సోషల్ మీడియా పోస్ట్‌లో గోదారా, బిష్ణోయ్‌పై ఈ వ్యాఖ్యలు చేశారు. లారెన్స్ బిష్ణోయ్‌కి అమెరికాలోని ఓ సంస్థతో సంబంధం ఉందని ఆరోపించాడు. బిష్ణోయ్ తన సోదరుడు…
జుబీన్ గార్గ్ అంత్యక్రియలు పూర్తి.. వేలాదిగా తరలివచ్చిన అభిమానులు ప్రముఖ అస్సామీ గాయకుడు జుబీన్ గార్గ్ అంత్యక్రియలు పూర్తయ్యాయి. గౌహతిలో ప్రభుత్వ లాంఛనాలతో అంత్యక్రియలు నిర్వహించారు. అంత్యక్రియలు జరుగుతుంటుండగా భార్య గరిమా సైకియా గార్గ్ ఏడుస్తూనే కనిపించారు. అస్సామీ మహిళలు ధరించే సాంప్రదాయ దుస్తులైన మేఖేలా చాదర్ ధరించారు. చితికి మంటలు అంటుకుంటున్న సమయంలో రెండు చేతులు జోడించారు. ఎక్కి.. ఎక్కి ఏడుస్తూనే కనిపించారు. పలువురు ఆమెను ఓదార్చుతూ కనిపించారు. మరో సౌత్ దర్శకుడి రెండేళ్లు టైం…
తెలంగాణ రైజింగ్ కోర్ అర్బన్ సిటీ ఏరియాను ప్రజల మౌలిక వసతులకు నిలువుటద్దం పట్టే గ్లోబల్ సిటీకి చిరునామాగా అభివృద్ధి చేయాలని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి అన్నారు. మానవ జీవన ప్రమాణాలకు కొలమానమైన విద్య, వైద్యం, రోడ్డు రవాణా, ప్రజల ఆరోగ్యాన్ని కాపాడే పారిశుద్ధ్యానికి అత్యంత ప్రాధాన్యమివ్వాలని సీఎం అన్ని విభాగాల ఉన్నతాధికారులకు దిశానిర్దేశం చేశారు. సిటీ విస్తరణలో భాగంగా రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల నుంచి, వివిధ రాష్ట్రాల నుంచి ఇక్కడికి ప్రజలు గ్రేటర్ సిటీకి లక్షలాది కుటుంబాలు…
రేపు మేడారంలో సీఎం రేవంత్ రెడ్డి పర్యటించనున్నారు. మేడారం జాతరను మరింత ఘనంగా నిర్వహించేందుకు సీఎం రేవంత్ నిర్ణయం తీసుకున్నారు. ఆసియా ఖండంలోనే అతి పెద్దదైన మేడారం జాతరను మరింత ఘనంగా నిర్వహించేందుకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేతృత్వంలోని ప్రజా ప్రభుత్వం నడుంబిగించింది. ఇంతకాలం మేడారం జాతరకు ప్రభుత్వాలు తాత్కాలిక ఏర్పాట్లు చేసేవి. జాతర నిర్వహణపై సమీక్షకు సైతం గతంలో ముఖ్యమంత్రులు పెద్దగా శ్రద్ధ చూపేవారు కాదు. తొలిసారిగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మేడారం జాతర ఏర్పాట్లపై…
రీజనల్ రింగ్ రోడ్డు ఉత్తర, దక్షిణ భాగాలతో పాటు రేడియల్ రోడ్ల నిర్మాణంపై అధికారులకు పలు సూచనలు చేశారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. ఇందుకు పెండింగ్ భూసేకరణ పనులను త్వరగా పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. హైదరాబాద్ నుంచి బందరు పోర్టు వరకు గ్రీన్ ఫీల్డ్ హైవే నిర్మాణం అంశంపై సమీక్షలో చర్చించారు. వీలైనంత త్వరగా రూట్ మ్యాప్ పై తుది నిర్ణయం తీసుకోవాలని సూచించారు. హైదరాబాద్- శ్రీశైలం హైవే లో ఎలివేటెడ్ కారిడార్ నిర్మాణానికి కేంద్రం…