తెలంగాణ ప్రజలు కన్న కలలు సాకారం అయిన రోజు. 58 ఏళ్లపాటు వివక్షకు గురైన జనం సొంత రాష్ట్రం సాధించుకున్న అద్భుతమయిన రోజు. నేడు తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం. ఇవాళ్టితో ప్రత్యేక రాష్ట్రంగా తెలంగాణ ఏర్పడి ఎనిమిదేండ్లు పూర్తయ్యాయి. తొమ్మిదవ ఏట అడుగుపెట్టాం. ఎంతో మంది తెలంగాణ అమరవీరుల త్యాగఫలంతో, ఉద్యమకారుల పోరాటంతో 2014 జూన్ 2న తెలంగాణ రాష్ట్రం ఆవిర్భవించింది. నీళ్లు, నిధులు, నియమాకాల నినాదంతో దేశంలో 29వ రాష్ట్రంగా తెలంగాణ రాష్ట్రం ఏర్పడింది.…