ఎమ్మెల్యే వర్సెస్ మాజీ ఎమ్మెల్యే. వైరా టీఆర్‌ఎస్‌లో గత మూడేళ్లుగా కనిపిస్తున్న సీన్. ఇప్పుడు కేసులు పెట్టుకునే వరకు వెళ్లింది ఆధిపత్యపోరు. సీఎం కేసీఆర్ బర్త్‌డే వేడుకలు నిర్వహించిన వారిపై కేసులు పెట్టడం ప్రస్తుతం జిల్లాలో హాట్ టాపిక్. మూడేళ్లుగా వైరాలో ఆధిపత్యపోరుఎన్నికల్లో గెలుపోటములు నేతల జాతకాలను మార్చేస్తాయి. ఉమ్మడి ఖమ్మంజిల్లా వైరాలోనూ అదే జరిగింది. ఇక్కడ ఎమ్మెల్యే రాములు నాయక్. 2018లో ఆయన ఇండిపెండెంట్‌గా గెలిచారు. టీఆర్‌ఎస్ అభ్యర్థి మదన్‌లాల్ ఓడిపోయారు. అప్పటి వరకు వైరాలో…