రాష్ట్రంలో కురుస్తున్న భారీ వానలకు గోదావరి పరివాహక ప్రాంతాల్లో వరదలు పోటెత్తాయి. ఈనేపథ్యంలో. సీఎం కేసీఆర్ రేపు (ఆదివారం) ఉదయం ఏరియల్ సర్వే చేపట్టనున్నారు. సీఎం కేసీఆర్ ఏరియల్ సర్వే కడెం నుంచి భద్రాచలం వరకు గోదావరి పరివాహక ప్రాంతాల్లో కొనసాగనుంది. ఈ కార్యక్రమంలో.. సీఎం కేసీఆర్ తో పాటు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్ పాల్గొననున్నారు. రేపు జరిగే ఏరియల్ సర్వేలో గోదావరి పరివాహక ప్రాంతాల్లో జరుగుతున్న సహాయక కార్యక్రమాలను సీఎం నేరుగా పర్యవేక్షించనున్నారు.…