రాజ్యాధికారం దిశగా కాపు సామాజికవర్గం యాక్టివ్ కావడం టీడీపీలో గుబులు రేపుతోందా? వచ్చే ఎన్నికల్లో అధికారంలోకి రావాలంటే కాపుల ఓట్లే కీలకమని లెక్కలేసుకుంటున్న తరుణంలో.. కొత్త పరిణామాలు టీడీపీని కలవర పెడుతున్నాయా? విపక్ష పార్టీలో జరుగుతున్న చర్చ ఏంటి? బీసీల తిరిగి దగ్గరయ్యారనే అంచనాల్లో టీడీపీఏపీలో వైసీపీ అధికారంలోకి వచ్చి రెండున్నరేళ్లు దాటింది. ప్రభుత్వంపై ప్రజల్లో వ్యతిరేకత పెరిగిందని.. క్షేత్రస్థాయిలో తమ పార్టీకి అనుకూల వాతావరణం ఉందని లెక్కలేస్తోంది టీడీపీ. గత ఎన్నికల్లో టీడీపీ ఓటమికి బీసీ,…
రాజమండ్రిలోని గైట్ కాలేజీలో ఆంధ్రప్రదేశ్ మహిళా సమాఖ్య సదస్సు నిర్వహించారు. ఈ సదస్సులో సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కె.రామకృష్ణ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. సీఎం జగన్ ఢిల్లీ టూర్ పై వాస్తవాలు బయటపెట్టాలని ఆయన డిమాండ్ చేశారు. ప్రధానితో ఎపుడు కలిసినా పాడిందేపాటగా ఒకే అంశం ప్రత్యేక హోదా అంటారు. గతంలో అడిగినవే అడిగారు. ప్రధానికి ఇచ్చిన వినతిపత్రంలో ఏమేమి అంశాలుపెట్టారో బయటకు రానివ్వరు అంటూ ఆయన వ్యాఖ్యానించారు. రాష్ట్రాన్ని అప్పుల ఊబిలో ముంచేస్తున్నారు.…
మాజీ సీఎం, ఏపీలో విపక్ష నేత చంద్రబాబు చేసిన వ్యాఖ్యలకు ప్రభుత్వ చీఫ్ విప్ గడికోట శ్రీకాంత్ రెడ్డి కౌంటర్ ఇచ్చారు. సీఎం ఢిల్లీ పర్యటన విజయవంతం అవుతుందని ఓర్వలేక చంద్రబాబు వ్యాఖ్యలు చేస్తున్నారన్నారు. ఐదేళ్ళ పాలనలో చంద్రబాబు ఏపీకి చేసిందేం లేదన్నారు ఏపీ చీఫ్ విప్ గడికోట శ్రీకాంత్ రెడ్డి. ఈవెంట్ మేనేజ్ మెంట్ పేరుతో వందల కోట్లు వేస్ట్ చేశారన్నారు. మీలా డ్రామాలు చేయడం మాకు చేతకాదన్నారు. పోలవరం ప్రాజెక్టులో భారీగా అవినీతి జరిగిందన్నారు.…
ఐదేళ్ళ పాలనలో చంద్రబాబు ఏపీకి చేసిందేం లేదన్నారు ఏపీ చీఫ్ విప్ గడికోట శ్రీకాంత్ రెడ్డి. ఈవెంట్ మేనేజ్ మెంట్ పేరుతో వందల కోట్లు వేస్ట్ చేశారన్నారు. మీలా డ్రామాలు చేయడం మాకు చేతకాదన్నారు. పోలవరం ప్రాజెక్టులో భారీగా అవినీతి జరిగిందన్నారు. రాష్ట్రంలో ఏ అంశంపైనైనా అంతా మోసమే చేశారన్నారు ఏపీ చీఫ్ విప్ గడికోట శ్రీకాంత్ రెడ్డి. ఐదేళ్ళలో 20వేల కోట్లు మాత్రమే పెట్టుబడులుగా వచ్చాయన్నారు. కడప, తిరుపతిలో అనేక పరిశ్రమలు వచ్చాయన్నారు.
ఏపీ ప్రభుత్వం గతంలో జీవో నెంబర్ 2ను ప్రవేశపెట్టింది. పంచాయతీ సర్పంచులు, సెక్రటరీల అధికారాలను వీఆర్వోలకు అప్పగిస్తూ ఈ జీవోను ఏపీ ప్రభుత్వం జారీ చేసింది. అయితే ప్రభుత్వం నిర్ణయాన్ని సవాల్ చేస్తూ సర్పంచులు ఏపీ హైకోర్టును ఆశ్రయించారు. జీవో నెంబర్ 2 పంచాయతీ రాజ్ చట్టానికి విరుద్ధమని పిటిషనర్లు పేర్కొన్నారు. దీంతో సర్పంచుల పిటిషన్‌పై విచారణ చేపట్టిన హైకోర్టు గతంలోనే జీవో నెంబర్ 2ను సస్పెండ్ చేసింది. అయితే దీనిపై మరోసారి హైకోర్టులో విచారణ కొనసాగుతోంది.…
ఏపీలో రాజకీయ కాక రేపుతోంది వంగవీటి రాధా రెక్కీ ఎపిసోడ్. ఈ కీలక అంశంపై మొదటి సారి స్పందించారు మంత్రి కొడాలి నాని. కొడాలి నాని సమక్షంలోనే తన హత్యకు రెక్కీ జరిగిందని వ్యాఖ్యలు చేసి సంచలనం రేపారు టీడీపీ నేత వంగవీటి రాధా. వంగవీటి రాధాకు ఏదైనా జరిగితే ప్రయోజనం కలిగేది చంద్రబాబుకే అన్నారు నాని. వంగవీటి రాధా అప్రమత్తంగా ఉండాలని ఆయన సూచించారు. తనను హత్య చేయటానికి రెక్కీ జరిగిందని రాధా నా సమీక్షంలోనే…
ఎన్నికలు ఏం లేకపోయినా కేవలం ప్రజలు ఎలా వున్నారు, వారి సమస్యలను తెలుసుకోవడానికే పల్లెబాట చేపట్టాం అన్నారు మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి. అర్హులందరికీ పధకాలు అందుతున్నాయో లేదా అని అడిగి తెలుసుకుంటున్నాం. కేవలం ఇల్లు, పెన్షన్ లాంటి చిన్న చిన్న సమస్యలు మాత్రమే ప్రజలు తీసుకొస్తున్నారు. అర్హులకు 100 శాతం పథకాలు అందించడమే ప్రభుత్వ లక్ష్యం. అందుకే క్షేత్ర స్థాయిలో పర్యటనలు చేస్తున్నాం అన్నారు. ఎలాంటి అవసరం వచ్చినా సచివాలయ వ్యవస్థ అందుబాటులో ఉంది. గతంలోలా కాకుండా…
ఏపీ ప్రభుత్వంపై మాజీ సీఎం చంద్రబాబు తీవ్ర విమర్శలు చేశారు. మంగళగిరిలో పార్టీ నేతలతో సమావేశం ముగిసిన తర్వాత ఆయన మాట్లాడుతూ… వైసీపీకి ప్రజలు నమ్మకంతో ఓటేస్తే.. జగన్ ఆ నమ్మకాన్ని ఒమ్ము చేశారని ఆరోపించారు. మద్య నిషేధం చేస్తామని చెప్పి ఈ ప్రభుత్వం ఏం చేస్తుందని ప్రశ్నించారు. న్యూఇయర్ రోజు ఒక్కరోజే రూ.124 కోట్ల అమ్మకాలు చేశారంటే మద్య నిషేధం ఎలా చేస్తారని ప్రజలను నమ్మమంటారని నిలదీశారు. సొంత మద్యం బ్రాండ్లతో అంతా దోచుకుని ఇప్పుడు…
ఏపీలో సినిమా టిక్కెట్ రేట్ల అంశం హాట్‌టాపిక్‌గా నడుస్తోంది. ఇప్పటికే దర్శకుడు రామ్‌గోపాల్ వర్మ ఏపీ ప్రభుత్వంపై ట్వీట్ల వర్షం కురిపిస్తున్నాడు. తాజాగా జనసేన పార్టీ సమావేశంలోనూ ఆ పార్టీ నేత నాదెండ్ల మనోహర్ సినిమా టిక్కెట్ల విషయాన్నే ప్రస్తావించారు. ఏపీలో సినిమా టిక్కెట్ల అంశం తప్ప సీఎం జగన్‌కు ఇంకేం తెలియదా అంటూ ప్రశ్నించారు. జగన్‌కు నిజంగా చిత్తశుద్ధి ఉంటే సిమెంట్ రేట్లు, ఇసుక రేట్లను వెంటనే తగ్గించాలని డిమాండ్ చేశారు. Read Also: రూపాయి…
ఏపీ డిప్యూటీ సీఎం ధర్మాన కృష్ణదాస్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. వచ్చే ఎన్నికల్లో వైసీపీ మళ్లీ ఘనవిజయం సాధిస్తుందని… జగన్ మళ్లీ సీఎం అవుతారని ఆయన ధీమా వ్యక్తం చేశారు. ఒకవేళ జగన్ మళ్లీ సీఎం కాకపోతే తాను రాజకీయాల నుంచి తప్పుకుంటానని ధర్మాన స్పష్టం చేశారు. శ్రీకాకుళంలో డ్వాక్రా బజార్ ప్రారంభోత్సవం సందర్భంగా మాట్లాడుతూ… వైసీపీలో విభేదాలు రచ్చకెక్కాయంటూ టీడీపీ నేతలు ప్రచారం చేస్తుండటంపై మండిపడ్డారు. టీడీపీ నేతలు కావాలనే దుష్ప్రచారం చేస్తున్నారని ధర్మాన ఆగ్రహం…