Budda Venkanna: కుప్పంలో చంద్రబాబు పర్యటనను వైసీపీ అడ్డుకునే యత్నం నిరసిస్తూ విజయవాడలో టీడీపీ నేతలు బుద్దా వెంకన్న, నాగుల్ మీరా నిరసన చేపట్టారు. ఈ సందర్భంగా నల్ల బ్యాడ్జీలు పెట్టుకుని వైసీపీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. అనంతరం టీడీపీ రాష్ట్ర కార్యదర్శి బుద్దా వెంకన్న మాట్లాడుతూ.. వైసీపీ అజెండా అమలు చేసే పోలీసుల్ని చొక్కాలు ఊడతీసి కొడతామని హెచ్చరించారు. చంద్రబాబు కుటుంబాన్ని అంతమొందించే లక్ష్యంతో వైసీపీ నేతలు వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. పోలీసులందరూ వైసీపీ యూనిఫామ్…
CM Jagan: ప్రకాశం జిల్లా పర్యటనలో గ్రానైట్ పరిశ్రమలపై సీఎం జగన్ వరాలు కురిపించారు. గ్రానైట్ పరిశ్రమల విషయంలో మహానేత వైఎస్ఆర్ హయాంలో మాదిరిగానే స్లాబ్ విధానాన్ని మళ్లీ తాము తీసుకువస్తున్నామని.. ఈరోజే జీవో నంబర్ 58 విడుదల చేశామని సీఎం జగన్ ప్రకటించారు. ప్రకాశం జిల్లాలో ఎక్కువ గ్రానైట్ పరిశ్రమలు ఉండటంతో సింగిల్ బ్లేడ్‌కు రూ.27వేలు, మల్లీ బ్లేడ్‌కు నెలకు రూ.54వేలు ఇచ్చేలా స్లాబ్ సిస్టమ్ తీసుకువస్తున్నామని సీఎం జగన్ పేర్కొన్నారు. గ్రానైట్ పరిశ్రమల నడ్డి…
Devineni Uma: టీడీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి దేవినేని ఉమ మరోసారి వైసీపీ ప్రభుత్వంపై తీవ్ర ఆరోపణలు చేశారు. ప్రధాని మోదీకి సీఎం జగన్ ఇచ్చిన వినతి పత్రాన్ని మీడియాకు ఇవ్వలేని దౌర్భాగ్య, నిస్సహాయ స్థితిలో జగన్ ఉండడం సిగ్గుచేటు అని ఆరోపించారు. 22 మంది ఎంపీలు, 9 మంది రాజ్యసభ సభ్యులు ఉండి కూడా విభజన హామీలను వైసీపీ నేతలు సాధించలేకపోతున్నారని దేవినేని ఉమ ఎద్దేవా చేశారు. పోలవరం నిర్వాసితులను ఆదుకునేవారే కరవయ్యారని.. పోలవరం…
AP Cabinet Meeting: ఆంధ్రప్రదేశ్ కేబినెట్ సమావేశం ఈనెల 29న అమరావతిలోని సచివాలయంలో సీఎం జగన్ అధ్యక్షతన జరగనుంది. ఈనెల 29న ఉదయం 11 గంటలకు ఏపీ కేబినెట్ సమావేశం ప్రారంభం అవుతుందని సీఎస్ సమీర్ శర్మ వెల్లడించారు. అయితే మంత్రివర్గ సమావేశంలో చర్చించి నిర్ణయం తీసుకోవాల్సిన అంశాలపై ఈ నెల 26వ తేదీ మధ్యాహ్నం 12 గంటల్లోగా ప్రతిపాదనలు పంపించాలని వివిధ ప్రభుత్వ శాఖల ముఖ్య కార్యదర్శులకు సీఎస్ సమీర్ శర్మ ఉత్తర్వులు జారీ చేశారు…