ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి 49వ జన్మదినోత్సవానికి అంతా సిద్ధం అయింది. వైసీపీ నేతలు ఎవరికి వారు తమదైన రీతిలో తమ అభిమాన నేత పుట్టినరోజు వేడుకలు జరిపేందుకు రెడీ అయ్యారు. గుంటూరు జిల్లాలో వైసీపీ నేతల మధ్య వైరం రోడ్డున పడింది. గుంటూరు జిల్లా దాచేపల్లి వైసీపీలో ఫ్లెక్సీ వివాదం చినికి చినికి గాలివానగా మారింది. ఎమ్మెల్సీ జంగా కృష్ణమూర్తి వర్గీయులు ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలను తొలగించారు ఎమ్మెల్యే కాసు మహేష్ రెడ్డి వర్గీయులు. గామాలపాడు…