జోధ్‌పూర్ ఘర్షణల్లో బాధ్యులపై చర్యలు తీసుకోకపోతే… పెద్దఎత్తున నిరసనలు తెలుపుతామని హెచ్చరించారు కేంద్ర మంత్రి గజేంద్ర షెకావత్. కావాలనే కొంతమంది అల్లర్లు సృష్టించారని ఆయన ఆరోపించారు. కార్లను ధ్వంసం చేయడం, ఇళ్లపై రాళ్లతో దాడి చేయడం, మహిళలను అవమానించడం వంటివి జరిగాయన్నారు. అల్లర్లకు అరికట్టడంలో… రాజస్థాన్ ప్రభుత్వం, పోలీసులు విఫలమయ్యాయన్నారు. రాత్రి అల్లర్లు జరిగినా… ఉదయానికి కూడా పోలీసులు ముందస్తు చర్యలు తీసుకోలేకపోయారని విమర్శించారు. కాగా, రాజస్థాన్‌లోని జోధ్‌పూర్‌లో టెన్షన్ వాతావరణం నెలకొంది. ఇరువర్గాల మధ్య సోమవారం…