వాతావరణ మార్పుల హెచ్చరికలను ప్రపంచం గుర్తించింది. 2070 నాటికి 'జీరో ఎమిషన్స్' సాధించాలనే భారత్ అంతర్జాతీయ నిబద్ధతకు మద్దతు లభించింది. ఇదిలా ఉండగా.. వాతావరణం, జీవావరణం మధ్య సమతుల్యతను పాటించాలని సుప్రీంకోర్టు మొదటిసారిగా ఆదేశాలు ఇచ్చింది.
తేనెటీగలు మానవ, పర్యావరణ ఆరోగ్యం రెండింటిపై ప్రత్యక్ష ప్రభావాన్ని చూపుతాయి. అలాంటి తేనెటీగల జీవితకాలం సగానికి తగ్గిందంటే నమ్ముతారా?. నిజమేనండి.. ఇన్ని రోజులు మనిషి జీవితకాలం మాత్రమే తగ్గుతుందని అనుకున్నాం.. కానీ జాబితాలోకి తేనెటీగలు కూడా వచ్చాయి.