Swachh Survekshan Awards 2022: దేశంలో వరసగా ఆరోసారి మధ్యప్రదేశ్ ఇండోర్ పరిశుభ్రమైన నగరంగా తొలిస్థానంలో నిలిచింది. తాజాగా ప్రకటించిన స్వచ్ఛ్ సర్వేక్షన్ అవార్డుల్లో ఇండోర్ నగరానికే పట్టం కట్టారు. సూరత్, నవీ ముంబై నగరాలు రెండు, మూడు స్థానాల్లో నిలిచాయి. స్వచ్ఛ్ సర్వేక్షన్ అవార్డ్స్ 2022 అవార్డులను కేంద్రం శనివారం ప్రకటించింది. దేశంలో అత్యంత పరిశుభ్రమైన నగరంగా వరసగా ఆరోసారి ఇండోర్ నగరంల నిలిచింది. ఆ తరువాతి స్థానాల్లో గుజరాత్ రాష్ట్రంలోని సూరత్, మహారాష్ట్రలోని నవీ…