సివిల్స్ 2021లో ర్యాంకులు సాధించిన వారందరికి మంత్రి కేటీఆర్ అభినందనలు తెలిపారు. ఇవాళ తన ట్విట్టర్‌లో ఆయన స్పందిస్తూ.. సివిల్స్ ఫలితాలతో సంక్పలం, పట్టుదలకు చెందిన కొన్ని అద్భుతమైన కథలు వెలుగులోకి వచ్చినట్లు మంత్రి కేటీఆర్ అన్నారు. సివిల్స్‌లో అసాధారణ ప్రతిభ కనబరిచిన టాప్ ముగ్గురు అమ్మాయిలకు మంత్రి కేటీఆర్ ప్రత్యేకంగా బెస్ట్ విషెస్ చెప్పారు. తెలంగాణ రాష్ట్రం నుంచి సివిల్స్‌కు ఎంపికైన ర్యాంకర్లను కూడా మంత్రి కేటీఆర్ మెచ్చుకున్నారు. మీ ప్రతిభ, ప్రయత్నాలతో ఈ దేశాన్ని…