J&K L-G inaugurates cinema halls in Pulwama, Shopian: కాశ్మీర్ ప్రాంతం సినిమా షూటింగులకు ఫేమస్ కానీ.. అక్కడి ప్రజలు మాత్రం సినిమాకు దూరం అయ్యారు. జమ్మూ కాశ్మీర్ ప్రాంతంలో దశాబ్ధాలుగా నెలకొని ఉన్న ఉగ్రవాదం కారణంగా అక్కడి థియేటర్లు అన్ని మూతపడ్డాయి. మళ్లీ ఎవరూ కూడా థియేటర్లను తెరవడానికి ప్రయత్నించలేదు. ఆర్టికల్ 370 రద్దు తరవాత జమ్మూ కాశ్మీర్ లో సాధారణ పరిస్థితులు నెలకొన్నాయి. ఉగ్రవాద కార్యకలాపాలకు భద్రతా బలగాలు చెక్ పెడుతున్నాయి.