Chitty Scam: 300 మంది కష్టార్జితం.. సుమారు 4 కోట్ల రూపాయలు.. చిట్టీల రూపంలో గల్లంతైపోయాయి. భారీ మోసాన్ని తట్టుకోలేక బాధితులు కుదేలయ్యారు. న్యాయం చేయాలంటూ పోలీస్ స్టేషన్ చుట్టూ కాళ్లు అరిగేలా తిరుగుతున్నా ప్రయోజనం లేకపోవడంతో ఆత్మహత్యే శరణ్యంగా భావించి ఆందోళన చేపట్టారు. కిరోసిన్ పోసుకొని ఆత్మహత్యా యత్నానికి పాల్పడ్డారు. వారంతా పేద మధ్య తరగతి కుటుంబాలుకు చెందినవారు. చిన్న చిన్న మొత్తాలను చిట్టీల రూపంలో నెల నెలా కట్టుకొని అవసరాలకు వాడుకునే వారు. పిల్లల…