“పుత్రోత్సాహము తండ్రికి పుత్రుడు జన్మించినపుడు పుట్టదు, జనులా పుత్రుని కనుగొని పొగడగ పుత్రోత్సాహంబు నాడు పొందుర సుమతీ!” అని సుమతీ శతకంలో పేర్కొన్నట్లు, ఒక తండ్రికి కుమారుడు పుట్టినప్పుడు కాదు, అతని విజయాన్ని చూసి జనం పొగిడినప్పుడే అసలైన పుత్రోత్సాహం. ఆ అసలైన పుత్రోత్సాహాన్ని ఈరోజు అనిల్ రావిపూడి తండ్రి ఫీలయ్యారు. అనిల్ రావిపూడి తండ్రి రావిపూడి బ్రహ్మయ్య గారు, ఆంధ్రప్రదేశ్ ఆర్టీసీ సంస్థలో ఒక డ్రైవర్‌గా పనిచేసేవారు. ఈ విషయాన్ని గతంలోనే అనిల్ రావిపూడి పలు…