మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం నటిస్తున్న “ఆచార్య” చిత్రం షూటింగ్ పూర్తయింది. ఇప్పుడు ఆయన “లూసిఫర్” రీమేక్ తో సెట్స్ మీదకి వెళ్లేందుకు రెడీ అవుతున్నాడు. ఈ క్రమంలో చిరు చికిత్స కోసం వైజాగ్ లో ఉన్నట్లుగా తెలుస్తోంది. చికిత్స అనగానే ఏమైందో అని కంగారు పడకండి. ఆయన షూటింగ్ కు వెళ్లేముందు డిటాక్సిడ్ అండ్ రిజునీవేనేటెడ్ అవ్వాలని అనుకుంటున్నారట. దానికోసం చిరు ఆయుర్వేద చికిత్స తీసుకోబోతున్నారట. అందుకోసమే చిరు వైజాగ్‌లోని ప్రముఖ ఆయుర్వేదిక్ స్పాలో ఉన్నాడని తెలుస్తోంది.…