Business Headlines 25-02-23: పేటీఎం బ్యాంక్‌లో విలీనం?: పేటీఎం పేమెంట్స్ బ్యాంక్‌లో ఎయిర్‌టెల్ పేమెంట్స్ బ్యాంక్ విలీనమయ్యే సూచనలు కనిపిస్తున్నాయి. ఈ మేరకు ఎయిర్‌టెల్ అధినేత సునీల్ మిత్తల్ ప్రణాళిక రూపొందించినట్లు విశ్వసనీయ వర్గాలు తెలిపాయి. పేటీఎంలో విలీనం కావటం ద్వారా వాటా సొంతం చేసుకోవాలని ఆశిస్తున్నారు. ఇతర షేర్ హోల్డర్ల నుంచి కూడా పేటీఎంలోని వాటాలను కొనుగోలు చేయాలని ప్రయత్నిస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి.