Grama Sabalu : చింతకాని మండల కేంద్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన పలు సంక్షేమ పథకాలు ఈనెల 26 నుండి ప్రారంభం కానున్నాయి. వీటిలో ముఖ్యంగా రైతు భరోసా, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా, ఇందిరమ్మ ఇల్లు, రేషన్ కార్డుల పంపిణీ కార్యక్రమాలు ఉన్నాయి. ఈ పథకాలకు సంబంధించి లబ్ధిదారుల ఎంపిక ప్రక్రియలో భాగంగా ఈరోజు ఉదయం 10 గంటలకు స్థానిక పంచాయతీ కార్యాలయంలో గ్రామసభ నిర్వహించారు. గ్రామసభకు పంచాయతీ కార్యదర్శి రమేష్ అధ్యక్షత వహించగా, మండల…