హైదరాబాద్ నగర శివారు శంషాబాద్ సమీపంలోని ముచ్చింతల్‌లో చిన్నజీయర్ స్వామిని కేంద్ర పర్యాటకశాఖమంత్రి కిషన్‌రెడ్డి శనివారం మధ్యాహ్నం కలిశారు. ఈ సందర్భంగా చిన్నజీయర్ స్వామి ఆశీస్సులను ఆయన తీసుకున్నారు. అనంతరం ఫిబ్రవరిలో జరగనున్న రామానుజ శతాబ్ది ఉత్సవాల ఏర్పాట్ల వివరాలను చిన్నజీయర్ స్వామిని అడిగి కిషన్‌రెడ్డి తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో మై హోం అధినేత జూపల్లి రామేశ్వరరావు కూడా పాల్గొన్నారు. వీరి సమావేశం సుమారు 40 నిమిషాల పాటు జరిగింది. Read Also: ఎలాన్ మస్క్‌ని ఆహ్వానించిన…
ముచ్చింతల్ ఆశ్రమంలో జరిగిన గోదా దేవి కల్యాణంలో పాల్గొన్న శ్రీ త్రిదండి చిన్న జీయర్ స్వామి. కల్యాణ అనంతరం శుక్రవారం మీడియాతో మాట్లాడారు. ఫిబ్రవరి 5న ప్రధాని ఆశ్రమంలో జరిగే రామానుజ విగ్రహ ఆవిష్కరణ కార్యక్రమంలో పాల్గొంటారన్నారు. వేదికలో మూడు తలాలు ఉన్నాయి. మద్య తలంలో బంగారు విగ్రహాన్ని ఫిబ్రవరి 13న రాష్ట్రపతి రాంనాథ్ కోవింద్ ప్రతిష్ట చేస్తారని చెప్పారు. ఫిబ్రవరి 14న ప్రాణ ప్రతిష్ట కార్యక్రమం నిర్వహించనున్నట్టు తెలిపారు. ప్రభుత్వం తరుపున అన్ని పనులు చేయడానికి…
శంషాబాద్ మండలం పరిధిలోని శ్రీరామనగరంలోని జీవా ఆశ్రమంలో శ్రీశ్రీశ్రీ త్రిదండి చిన్న శ్రీమన్నారాయణ రామానుజ జీయర్ స్వామిజీ, తెలంగాణ ముఖ్యమంత్రివర్యులు కల్వకుంట్ల చంద్రశేఖర్ రావుగారితో కలిసి “గ్రీన్ ఇండియా ఛాలెంజ్” కార్యక్రమంలో పాల్గొని జమ్మి మొక్కను నాటారు. అనంతరం చిన్నజీయర్ స్వామీజీ మాట్లాడుతూ.. “వృక్షో రక్షతి రక్షితా:” అన్నారు మన పెద్దలు. కానీ, ఆధునిక మానవుడు చెట్లను కొట్టేస్తూ..కొండలను తవ్వేస్తూ ప్రకృతిని విధ్వంసం చేస్తున్నాడు. ఈ తరుణంలో మన భారతీయ సంస్కృతి భూమి గురించి, ప్రకృతి గురించి,…