ఢిల్లీలోని పాలికా బజార్‌లోని ఓ దుకాణంలో రెండు చైనీస్ మొబైల్ జామర్‌లు స్వాధీనం చేసుకోవడంతో కలకలం రేగింది. ఈ జామర్ల సామర్థ్యం 50 మీటర్లు. ఈ సంఘటనపై షాపు యజమాని రవి మాథుర్‌ను అరెస్టు చేశారు. ఈ జామర్‌ను లజ్‌పత్‌రాయ్ మార్కెట్ నుంచి రూ.25 వేలకు కొనుగోలు చేసినట్లు రవి తెలిపాడు.