China : చైనాలోని దక్షిణ ప్రాంతంలో ఉన్న గ్వాంగ్‌డాంగ్ ప్రావిన్స్‌లో భారీ వర్షాల కారణంగా భారీ వరదలు, కొండచరియలు విరిగిపడటంతో ఇప్పటి వరకు 47 మంది మరణించారు. మెయిజౌ నగరంలో మరో 38 మంది మరణించినట్లు ధృవీకరించినట్లు చైనా ప్రభుత్వ మీడియా శుక్రవారం మధ్యాహ్నం తెలిపింది.
ప్రపంచ వ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తున్నాయి.. మొన్నటివరకు భారత దేశాన్ని వణికించిన భారీ వర్షాలు.. ఇప్పుడు చైనాను ముంచేస్తున్నాయి.. బీజింగ్‌లో భారీ వర్షాలు బీభత్సం సృష్టించాయి. గత కొన్ని రోజులుగా కురుస్తున్న వర్షాల కారణంగా ఇక్కడ వరదల పరిస్థితి ఏర్పడింది.. ఇకపోతే ఈ వరదల్లో ఇప్పటివరకు 20 మంది మరణించగా, 30 మంది గల్లంతయ్యారు. మృతుల సంఖ్య ఇంకా పెరిగే అవకాశం ఉందని మీడియా లో వార్తలు వస్తున్నాయి. ఇక భారీ వర్షాల కారణంగా రైల్వే స్టేషన్లను…