ప్రపంచ వ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తున్నాయి.. మొన్నటివరకు భారత దేశాన్ని వణికించిన భారీ వర్షాలు.. ఇప్పుడు చైనాను ముంచేస్తున్నాయి.. బీజింగ్‌లో భారీ వర్షాలు బీభత్సం సృష్టించాయి. గత కొన్ని రోజులుగా కురుస్తున్న వర్షాల కారణంగా ఇక్కడ వరదల పరిస్థితి ఏర్పడింది.. ఇకపోతే ఈ వరదల్లో ఇప్పటివరకు 20 మంది మరణించగా, 30 మంది గల్లంతయ్యారు. మృతుల సంఖ్య ఇంకా పెరిగే అవకాశం ఉందని మీడియా లో వార్తలు వస్తున్నాయి.
ఇక భారీ వర్షాల కారణంగా రైల్వే స్టేషన్లను మూసివేయాల్సి వచ్చిందని ప్రభుత్వ ప్రసార సంస్థ ‘సీసీటీవీ’ మంగళవారం (ఆగస్టు 1) తెలిపింది. దీంతో పాటు చిక్కుకుపోయిన రైల్వే ప్రయాణికులను ప్రస్తుతానికి పాఠశాలల్లోనే ఉంచారు. అదే సమయంలో వారిని సరఫరా చేయడానికి సైనిక హెలి కాప్టర్‌లను మోహరించారు. చైనా ప్రభుత్వ మీడియా గ్లోబల్ టైమ్స్ ప్రకారం.. వరద నీరు ప్రజల ఇళ్లను నింపింది. వేలాది మంది ప్రజలను ప్రభావితం చేసింది… చాలా మంది వరదలో చిక్కుకున్నారు..
బీజింగ్, పరిసర ప్రాంతాల్లో శనివారం భారీ వర్షం ప్రారంభమైంది. ఇది సుమారు 40 గంటల పాటు కొనసాగింది. భారీ వర్షాల కారణంగా పరిస్థితి అత్యంత దారుణంగా మారింది. రాజధాని బీజింగ్‌లో రోడ్లన్నీ నదిలా కనిపించడం ప్రారంభించాయి. గ్లోబల్ టైమ్స్ మంగళవారం తన నివేదికలో ఇప్పటివరకు 20 మంది మరణించగా, 30 మంది అదృశ్యమయ్యారని తెలుస్తుంది.. ఈ 26 మంది సైనికులు, నాలుగు హెలికాప్టర్లతో కూడిన సైనిక బృందం పశ్చిమ బీజింగ్ జిల్లాలోని మెంటౌగౌలోని రైల్వే స్టేషన్ చుట్టూ చిక్కుకున్న వ్యక్తులను బయటకు తీసుకొచ్చేందుకు అన్ని ప్రయత్నాలు చేస్తున్నారు.. బీజింగ్‌లోని ఫాంగ్‌షాన్, మెంటౌగౌ తో సహా పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు కురిశాయి. దీనివల్ల మూడు రైళ్లు వాటి మార్గంలో చిక్కుకున్నాయి. దీంతో పాటు కొన్ని చోట్ల ప్రధాన రహదారులు నీటిలో కొట్టుకుపోయాయి.. మొత్తంగా చైనా పరిస్థితి దారుణంగా మారిందని చెప్పాలి.. ఇంకా సహాయ చర్యలు కొనసాగుతున్నాయి
. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు..