Srushti Fertility Case: సృష్టి ఫెర్టిలిటీ కేసులో నిందితురాలు కల్యాణి రిమాండ్ రిపోర్ట్ లో కీలక అంశాలు వెలుగులోకి వచ్చాయి. సృష్టి ఫెర్టిలిటీ మోసాల్లో మేనేజర్ కల్యాణి కీ రోల్ పోషించినట్లు సమాచారం. అక్రమాల ద్వారా వచ్చిన ప్రాఫిట్ ను కల్పనకు డాక్టర్ నమ్రతా షేర్ చేసినట్లు గుర్తించారు. వైజాగ్ లో ని సృష్టి ఫెర్టిలిటీ సెంటర్ లో 2012లో ANM నర్స్ గా చేరిన కల్యాణి సేవలను గుర్తించి, 2020లో వైజాగ్ బ్రాంచ్ కి మేనేజర్ గా డాక్టర్ నమ్రతా అపాయింట్ చేసింది. అప్పటి నుంచి సృష్టి ఫెర్టిలిటీ లో మేనేజర్ గా బాధ్యతలు నిర్వహిస్తున్న కల్యాణి.. నమ్రతా చెప్పింది చేసినందుకు కల్పనకు భారీ విల్లా గిఫ్ట్ గా ఇచ్చింది.. వైజాగ్ లోని ocean view apartment ను వినియోగించుకుంటున్న కల్యాణి.. ఆర్థిక ఇబ్బందులు కారణంగా, నమ్రతా చేసే మోసాలకు సహకరించింది.. సృష్టి ఫెర్టిలిటీ లావాదేవీల వ్యవహారాలు మొత్తం కల్యాణి చూసుకున్నట్లు రిమాండ్ రిపోర్టులో తేలింది.
Read Also: Delhi: ఢిల్లీలో దారుణం.. బర్త్‌డే జరుపుకుంటున్న వ్యక్తిని కత్తితో పొడిచి హత్య
అయితే, దళారులు పంపించే స్కానింగ్ రిపోర్ట్ ను ఎడిటింగ్ చేసిన కల్యాణి.. వాటిని వాట్సాప్ లో పిల్లలు లేని తల్లిదండ్రులకు పంపించేది అని రిమాండ్ రిపోర్టులో పోలీసులు ప్రస్తావించారు. ఇక, హైదరాబాద్ కు చెందిన రాజస్థాన్ దంపతులు మొదటిగా కలిసింది కల్యాణినే.. జూన్ 5వ తేదీన మగ బిడ్డకు జన్మించిన అస్సాం మహిళ.. ఆ శిశువును రాజస్థాన్ దంపతులకు కల్యాణి అప్పగించింది.. వైజాగ్ లో కల్యాణికి రాజస్థాన్ దంపతులు రూ. 2 లక్షలు చెల్లించారు. బాబుకు జాండిస్ ఉందని చెప్పి వైజాగ్ లోని లోటస్ హాస్పిటల్ లో జాయిన్ చేయాలని కల్యాణి చెప్పినట్లు సమాచారం. ఇక, నిందితులకు బెయిల్ ఇస్తే సాక్షులను తప్పుదోవ పట్టిస్తూ, సాక్షాలు తారుమారు చేసే అవకాశం ఉందని రిమాండ్ రిపోర్టులో పోలీసులు పేర్కొన్నారు.
ఇక, నిందితులను కస్టడీకి ఇస్తే మరిన్ని విషయాలు బయటపడే అవకాశం ఉందని పోలీసులు కోరారు. ఈ కేసులో 39 మంది సాక్షాలను రిపోర్టులో జోడించారు. సృష్టి టెస్ట్ ట్యూబ్ సెంటర్ సోదాల్లో 2.37 లక్షలు స్వాధీనం చేసుకున్నాం.. A3 నిందితురాలు కళ్యాణి అచ్చయ్యమ్మను అదుపులోకి తీసుకొని విచారిస్తే సరోగసి మోసం విషయం ఒప్పుకుంది అన్నారు. కళ్యాణి అచ్చయ్యమ్మను ట్రాన్సిట్ వారెంట్ ద్వారా తీసుకొచ్చాం.. పోలీసుల తనిఖీల్లో దొరికినా పేషేంట్స్ కు సంబంధించిన వందల కేసు షీట్స్, రికార్డ్స్ స్వాధీనం చేసుకున్నాం.. నవజాత శిశువులను కొంటున్నా బ్యాంకు ట్రాన్సక్షన్స్ ను పోలీసులు గుర్తించారు.