Pawan Kalyan: కార్మికుడికి ఉద్యోగం అంటే కేవలం జీతం కాదు, అది అతని గౌరవం, భద్రత అని జస్టిస్ వి. గోపాల గౌడ నిరూపించారు. కార్మికుడికి రక్షణ, ఒక హైకోర్టు తీర్పుని కొట్టివేస్తూ, కార్మికుడికి అక్రమ తొలగింపునకు పరిహారం బదులు ఉద్యోగం పునరుద్ధరణ తప్పనిసరి అని తీర్పునిచ్చారని డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ అన్నారు. తాజాగా కర్ణాటక, చిక్కబళ్లాపూర్ జిల్లా చింతామణి పట్టణంలో జస్టిస్ వి.గోపాల గౌడ అమృత మహోత్సవంలో పాల్గొన్న డిప్యూటీ సీఎం పవన్ ప్రసంగించారు.