తీర్పుల సందర్భంగా.. ఇతర కార్యక్రమాల్లో పాల్గొన్న సమయంలోనూ పలు ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేస్తూ.. అందరి దృష్టిని ఆకర్షిస్తున్నారు సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ.. ఇప్పుడు ఆయన.. ఈ మధ్యనే ముగిసిన పార్లమెంట్ సమావేశాలు జరిగిన తీరుపై స్పందిస్తూ.. తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. చట్టాలను రూపొందించే సమయంలో చర్చలపై కాకుండా ఆటంకాలు సృష్టించడంపైనే ఎక్కువ దృష్టి సారిస్తున్నారని వ్యాఖ్యానించారు.. ఒకప్పుడు సభలో మొత్తం లాయర్లే ఉన్న సమయంలో పార్లమెంట్ ఎంతో హుందాగా నడిచేదంటూ ఆసక్తికర…