భారత ఎన్నికల ప్రధాన కమిషనర్ గా రాజీవ్ కుమార్ నేడు బాధ్యతలు తీసుకోనున్నారు. భారత రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ కొత్త చీఫ్ ఎలక్షన్ కమిషనర్ గా రాజీవ్ కుమార్ ను నియమించారు. ఇంతకు ముందు ఉన్న చీఫ్ ఎలక్షన్ కమిషనర్ సుశీల్ చంద్ర పదవి కాలం నేటితో ముగుస్తుండటంతో కొత్త నియామకం చేపట్టారు. మే 15 నుంచి రాజీవ్ కుమార్ నియామకం అమలులోకి రానుంది. ముగ్గురు సభ్యులు ఉండే పోల్ ప్యానెల్ లో సుశీల్ చంద్ర…