బర్డ్ ఫ్లూ భయంతో సండే చికెన్ సేల్స్ కుదేలైపోయాయి. కేజీ 30 రూపాయలు తగ్గించి అమ్మినా.. కొనే దిక్కులేదు. అదే సమయంలో మటన్ 1000 రూపాయలు మార్క్ దాటేస్తే.. ఫిష్ 200 రూపాయలకు పైనే పలుకుతోంది. వైరస్ భయం మనసులో పెట్టుకుని.. చికెన్ తినడం రిస్కే అంటున్నారు జనాలు. అటు బిర్యానీ పాయింట్లు, హోటళ్లలో 40 శాతం అమ్మకాలు పడిపోయాయి. దాంతో వ్యాపారాలు లబోదిబో అంటున్నారు. బర్డ్ ఫ్లూ భయంతో నాటు కోళ్ల కొనుగోలుకు బారులు తీరారు…
ప్రస్తుతం రెండు తెలుగు రాష్ట్రాల్లో ‘బర్డ్ ఫ్లూ’ భయాందోళన కలిగిస్తోంది. కోళ్లకు వైరస్ సోకి పెద్ద ఎత్తున మృత్యువాత పడుతుండటంతో.. జనాలు చికెన్ తినేందుకు భయపడుతున్నారు. బర్డ్ ఫ్లూ కారణంగా చికెన్ ధరలు కూడా భారీగా తగ్గిపోయాయి. అయినా చికెన్ అమ్మకాలపై బర్డ్ ఫ్లూ ఎఫెక్ట్ భారీగా పడింది. బర్డ్ ఫ్లూపై సోషల్ మీడియాలో వీడియోలు వైరల్ అవుతున్న నేపథ్యంలో హైదరాబాద్‌లో సగానికి పైగా చికెన్ అమ్మకాలు తగ్గాయి. హైదరాబాద్‌లో నిత్యం దాదాపుగా 6 లక్షల కిలోల…
ఒకప్పుడు బర్డ్ ఫ్లూ పేరు చెప్పగానే జనం హడలిపోయారు. దేశంలో చికెక్ అమ్మకాలు భారీగా పడిపోయాయి. దేశంలో మరోసారి బర్డ్ ఫ్లూ కలకలం రేపుతోంది. బీహార్ లో వరుసగా పక్షులు చనిపోవడం అధికారులను ఆందోళనకు గురి చేస్తుంటే.. వ్యాపారులు మాత్రం టెన్షన్ పడుతున్నారు. దీంతో బీహార్ లో చికెన్ తినకుండా చూడాలని జిల్లా అధికారులు ప్రజలను ఆదేశించారు. మళ్లీ తమకు గడ్డురోజులు వచ్చినట్టేనని వ్యాపారులు తలలు పట్టుకుంటున్నారు. గత కొన్నాళ్ళుగా బీహార్‌లోని సుపాల్ జిల్లాలో వరుసగా పక్షులు…