Cheryala ZPTC Shette Mallesham : చేర్యాల జెడ్పీటీసీ శేట్టే మల్లేశంపై గుర్తు తెలియని వ్యక్తుల దాడి చేసిన ఘటన సిద్దిపేట జిల్లా చేర్యాల మండంలం గుజ్జకుంటలో సంచలనంగా మారింది. వాకింగ్ కు వెళ్తుండగా గొడ్డళ్లు, కత్తులతో దాడి దుండగులు చేశారు. దీంతో మల్లేశంకు తలకు తీవ్ర గాయాలయ్యాయి. రక్తపు మడుగులో పడి ఉన్న మల్లేశంను హుటాహుటిన సిద్దిపేట ప్రభుత్వాస్పత్రికి తరలించారు. అయితే మల్లేశం అపస్మారక స్థితిలోకి వెళ్లిపోయారు. పరిస్థితి విషమించడంతో కుటుంబ సభ్యులు హైదరాబాద్ తరలించారు. అయితే ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మల్లేశం మృతిచెందారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
Read also: KKD Death Permission: ప్లీజ్.. చనిపోయేందుకు అనుమతివ్వండి
సిద్దిపేట నుంచి హైదరాబాద్ తీసుకెళ్తుండగా మార్గ మధ్యలోనే మల్లేశం మృతి చెందినట్లు కుటుంబ సభ్యలు తెలిపారని పోలీసులు పేర్కొన్నారు. ఉదయం వాకింగ్ కి వెళ్తుండగా గొడ్డళ్లు, కత్తులతో మల్లేశంపై కొందరు దుండగులు దాడి చేశారు. అయితే మల్లేశం తలకి తీవ్ర గాయాలతో రక్తపు మడుగులో పడిఉంటంతో గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. అయితే మల్లేశంను ఆస్పత్రికి తరలించే లోపే మృతి చెందినట్లు తెలిపారు.
ఉర్లో జరపాల్సిన పెద్ద పండగ పై ఇరువర్గాల ఘర్షణ నేపథ్యంలో హత్యకు గల కారణం అని పోలీసులు భావిస్తున్నారు. పెద్ద పండగ ను జెడ్పీటీసీ శెట్టే మల్లేశం జరపకూడదంటూ ఒక వర్గం గొడవ జరిగిందని కుటుంభ సభ్యలు పోలీసులకు తెలిపారు. దాడికి పాల్పడిన ఏడుగురు స్వంత గ్రామస్తులు నంగి సత్తయ్య, నంగి అనిల్, బొమ్మగొని శ్రీరాములు, బొప్పనపల్లి అయ్యాలం పెద్ద, నంగి చంద్రకాంత్, శెట్టే శ్రీను, పొలబోయిన మహేందర్, నంగి చంద్రకాంత్ లను అనుమానితులుగా కుటుంబ సభ్యులు చెప్తున్నారని పోలీసులు తెలిపారు. వారే శెట్టే మల్లేశం ను హతమార్చారాని కుటుంబసభ్యుల ఆందోళనకు దిగారని, మృతుడు జెడ్పీటీసీ శెట్టే మల్లేశం కు ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. అయితే రోజూ మల్లేశం వాకింగ్ వెళ్తాడనే ముందే గ్రహించిన దుండగులు అతన్ని ప్లాన్ ప్రకారమే హత్య చేసినట్లు తెలుస్తోందని పేర్కొన్నారు. రియల్ ఎస్టేట్ వ్యాపారమే కారణమా? లేక మరే ఇతర కారణాలు ఉన్నాయా? అనే కోణంలో కేసును దర్యాప్తు చేస్తున్నారు పోలీసులు.
Droupadi Murmu: రాష్ట్రపతికి స్వాగతం పలికిన గవర్నర్, మంత్రి సత్యవతి.. మళ్లీ సీఎం కేసీఆర్ డుమ్మా..