ఛత్తీస్‌ఘడ్‌లోని సుక్మా జిల్లాలో మరోసారి మావోయిస్టులు రెచ్చిపోయారు. కొంటా బ్లాక్‌లోని పిట్ట గ్రామానికి చెందిన ఐదుగురు గ్రామస్థులను మావోయిస్టులు కిడ్నాప్ చేశారు. శుక్రవారం నలుగురిని కిడ్నాప్ చేయగా, శనివారం మరో గ్రామస్థుడిని కిడ్నాప్ చేసినట్లు సమాచారం. కిడ్నాప్ చేసిన గ్రామస్థుల గురించి ఇప్పటివరకు ఎలాంటి సమాచారం లేదు. గ్రామస్తులందరినీ సురక్షితంగా విడుదల చేయాలని సర్వ ఆదివాసీ సమాజ్ నక్సలైట్లకు విజ్ఞప్తి చేసింది.
వివాహ వ్యవస్థలో భార్యాభర్తల మధ్య అనుమానాలు సాధారణం. భర్త మరొకరితో సంబంధం పెట్టుకున్నాడని, భార్య వేరొకరితో మాట్లాడుతుందని.. డబ్బులు ఇంట్లో ఇవ్వనుకుండా భర్త ఏం చేస్తున్నాడని .. ఇలాంటి అనుమానాలు ఉండడం సాధారణం. కానీ, భర్త ఒక హత్య చేసాడని, వాళ్ల కుటుంబమే హంతకుల ఫ్యామిలీ అని అనుమానించిన భార్య.. అతడిని ఎత్తిపొడుస్తూ అవమానించడంతో ఆ భర్త తట్టుకోలేకేపోయాడు.. ఆగ్రహంతో భార్యను సుత్తితో తలపై బాది హతమార్చి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. తామిద్దరం లేకపోతే పిల్లలు అనాధలవుతారని వారిని…
ఛత్తీస్‌ఘఢ్-.బీజాపూర్ తెలంగాణ సరిహద్దులో పోలీసులకు మావోయిస్టులకు మధ్య ఎదురు కాల్పులు జరిగాయి. బీజాపూర్ జిల్లాలో ఈ ఎదురు కాల్పులు జరగగా ముగ్గురు మావోయిస్టుల మృతిచెందారు. ఘటనా స్థలం నుంచి ఎస్‌ఎల్‌ఆర్, ఎకె47 రైఫిల్‌లు స్వాధీనం చేసుకున్నారు. బీజాపూర్‌లోని తర్లగూడ తెలంగాణ సరిహద్దు లో ఎదురు కాల్పులు కొనసాగుతున్నాయి. దీనికి సంబంధించి మరింత సమాచారం అందాల్సి వుంది.
కుటుంబాన్ని వదిలి అడవిలో బతుకుతున్న మావోయిస్టులు లొంగిపోవాలంటూ పోలీసులు అనేక రకాలుగా అవగాహన కార్యక్రమాలు చేపడుతున్నారు.. ఈ క్రమంలో ఛత్తీస్ గఢ్ లోని పలు ప్రాంతాలకు చెందిన 43 మంది మావోయిస్టులు.. పోలీసుల ముందు లొంగిపోయారు. ఈ విషయాన్ని ఎస్పీ సునీల్ శర్మ ధృవీకరించారు. సుక్మా జిల్లా గాధిరాస్, చింతగుఫా, కుక్‌నార్, పుల్బగ్డీ గ్రామాలకు చెందిన వీరు బుధవారం ఎస్పీ సునీల్ శర్మ, సీఆర్ఫీఎఫ్ అధికారుల సమక్షంలో జనజీవన స్రవంతిలో కలిశారు. అయితే వీరికి రూ.10 వేల…
ఛత్తీస్ ఘడ్ విషాదం చోటుచేసుంది. రాయపూర్ పచ్పెడీనాకా పరిధిలోని రాజధాని ఆస్పత్రిలో అగ్ని ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో 5 రోగులు దహనం అయ్యారు. ఐసియూలోని ఫ్యాన్ లో షార్ట్ సర్క్యూట్ జరిగిన కారణంగా చెలరేగిన మంటలు.. ఆస్పత్రిలోని కరోనా రోగుల వార్డ్ కు వ్యాపించింది. దీనితో అక్కడి రోగులు పరుగులు పెట్టారు. అటు సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది వెంటనే అక్కడకు చేరుకొని మంటలను అదుపులోకి తెచ్చారు. మంటలు అదుపులోకి వచ్చిన అనంతరం పరిశీలించగా 5…