మల్లూవుడ్ లో సీనియర్ హీరోయిన్ మంజు వారియర్. ప్రముఖ నటుడు దిలీప్ ను పెళ్ళిచేసుకుని, 1998లో నటనకు దూరమైన మంజు వారియర్, అతని నుండి విడాకులు తీసుకున్న తర్వాత తిరిగి ‘హౌ ఓల్డ్ ఆర్ యు’తో 2014లో రీఎంట్రీ ఇచ్చింది. మలయాళంతో పాటు తమిళ సినిమాల్లోనూ నటిస్తోంది. ప్రస్తుతం చిరంజీవి హీరోగా తెరకెక్కుతున్న మలయాళ చిత్రం ‘లూసిఫర్’ మాతృకలో మంజు వారియర్ కీలక పాత్ర పోషించింది. అలానే ఇటీవల వచ్చిన వెంకటేశ్ ‘నారప్ప’ తమిళ మాతృక ‘అసురన్’లో…