అందం, అభినయం కలబోసుకున్న ఛార్మి కౌర్ కొన్ని సార్లు చిందులతోనూ కనువిందు చేసింది. ప్రస్తుతం నటనకు దూరంగా జరిగినా, చిత్రసీమలోనే నిర్మాతగా కొనసాగుతోంది ఛార్మి. ఈ మధ్యే “నా జీవితంలో పెళ్ళి అనే తప్పు చేయబోను…” అంటూ ఓ స్టేట్ మెంట్ పడేసి అందరినీ ఆశ్చర్య పరచింది. ముద్దుగా బొద్దుగా ఉన్నా, మురిపించే నటనతో జనాన్ని మైమరపించింది ఛార్మి. ‘మంత్ర’గా తనదైన అభినయంతో ఉత్తమనటిగా నంది అవార్డును సొంతం చేసుకున్న ఛార్మి ఆపై కూడా కొన్ని చిత్రాలలో…