నటుడిగా, దర్శకుడిగా రవిబాబుకు తెలుగులో మంచి గుర్తింపే ఉంది. యాడ్ ఫిల్మ్ మేకర్ కూడా అయిన రవిబాబు డైరెక్టర్ గా డిఫరెంట్ జానర్ మూవీస్ చేశారు. కామెడీ, లవ్, హారర్, థ్రిల్లర్ మూవీస్ తీసి తెలుగు ప్రేక్షకులను మెప్పించారు. అయితే కొంతకాలంగా ఆయన తీసిన సినిమాలేవీ విజయం సాధించడం లేదు. బహుశా ఆ ఫ్రస్ట్రేషన్ తో కాబోలు ఇప్పుడు అడల్ట్ కామెడీ మూవీని తీశారు. ‘క్రష్’ పేరుతో రూపుదిద్దుకున్న ఈ సినిమా ప్రస్తుతం జీ 5లో స్ట్రీమింగ్…