Maruthi: ఈ మధ్య కాలంలో త్రిబాణదారి బార్బరిక్ అనే సినిమా ప్రేక్షకులకు నచ్చలేదని చెప్పి, ఆ సినిమా దర్శకుడు చెప్పుతో కొట్టుకుని సంచలనానికి కేంద్ర బిందువుగా మారాడు. సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌లో అతను మాట్లాడుతూ, సినిమా ప్రేక్షకులకు నచ్చకపోతే చెప్పుతో కొట్టుకుంటానన్నాడు. ప్రేక్షకులు పెద్దగా సినిమా మీద ఆసక్తి కనబరచకపోవడంతో, నిజంగానే చెప్పుతో కొట్టుకొని హాట్ టాపిక్ అయ్యాడు. నిజానికి ఈ సినిమాని ప్రజెంట్ చేసింది దర్శకుడు మారుతి. మారుతి టీం ప్రోడక్ట్‌గా ఈ సినిమా ప్రేక్షకుల…