ఆంధ్రప్రదేశ్‌లో లక్ష మంది క్వాంటం కంప్యూటింగ్ నిపుణులను తయారు చేయడమే లక్ష్యంగా ప్రభుత్వం ముందుకెళ్తోందని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తెలిపారు. ఈ దిశగా ప్రారంభించిన అడ్వాన్స్‌డ్ క్వాంటం స్కిల్లింగ్ కోర్సుకు అనూహ్య స్పందన లభిస్తుండటంపై సీఎం హర్షం వ్యక్తం చేశారు. ఇప్పటి వరకు ఈ కోర్సు కోసం దాదాపు 50 వేల మంది అభ్యర్థులు నమోదు చేసుకున్నారని సీఎం వెల్లడించారు. ఈ మేరకు ఆయన ఎక్స్ (X) వేదికగా స్పందించారు. ఏపీని క్వాంటం టెక్నాలజీ రంగంలో…