Nimmala Ramanaidu: ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు విడుదల చేసిన షెడ్యూల్ ప్రకారం పనులు సాగుతున్నాయని, 2027 నాటికి పోలవరం ప్రాజెక్టును పూర్తిచేస్తామని జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు తెలిపారు. తాజాగా అమరావతిలోఇరిగేషన్ ప్రాజెక్టుల పనుల పురోగతిపై ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సమావేశంలో ఇరిగేషన్ అడ్వైజర్ వెంకటేశ్వరరావు, ఈఎన్సీ నరసింహామూర్తి సహా ఇతర ఉన్నతాధికారులు హాజరయ్యారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. ప్రస్తుతం పోలవరం ప్రాజెక్టు పనులు మొత్తం 87 శాతం పూర్తయ్యాయన్నారు. కొత్త డయాఫ్రం…