Off The Record: కేబినెట్ సహచరుల్ని ఈ మధ్య కాలంలో తరచూ హెచ్చరిస్తున్నారు ఏపీ సీఎం చంద్రబాబు. పని చేయండి, పరుగులు పెట్టండి అంటూ తరుముతున్నారు. ప్రతిపక్షం విమర్శలకు గట్టి కౌంటర్స్ వేయమని కూడా సూచిస్తున్నారు. కానీ…ఎక్కువ మంది మంత్రులు వీటిలో ఏ ఒక్క పనీ సమర్ధంగా చేయడం లేదన్న అభిప్రాయం బలపడుతోందట టీడీపీ వర్గాల్లో. నేను 95 సీఎం అవుతా… నా స్పీడ్ మీరు అందుకోవాలని కూడా పదే పదే చెబుతున్నారు చంద్రబాబు. 95లో ఉన్నట్టుగా…