ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబుకి దక్కిన అరుదైన గౌరవంపై రాష్ట్ర వ్యాప్తంగా హర్షం వ్యక్తమవుతోంది. ప్రతిష్టాత్మక ‘ఎకనమిక్ టైమ్స్’ సంస్థ ఆయనను ‘బిజినెస్ రిఫార్మర్ ఆఫ్ ద ఇయర్’ పురస్కారానికి ఎంపిక చేయడంపై రాజకీయ, పారిశ్రామిక వర్గాల్లో ఆసక్తికర చర్చ జరుగుతోంది. దీనిపై డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ప్రత్యేక అభినందనలు తెలియజేస్తూ ఒక ప్రకటన విడుదల చేశారు. చంద్రబాబు నాయకత్వ శైలి నవతరానికి ఎంతో స్ఫూర్తినిస్తుందని పవన్ కల్యాణ్ పేర్కొన్నారు. రాష్ట్ర భవిష్యత్తు కోసం ఆయన అమలు…