బాలీవుడ్ నటి, పంజాబ్ కింగ్స్ సహ యజమాని ప్రీతి జింటా తన కో-ఓనర్ (సహ యజమానుల)లపై కోర్టులో కేసు వేశారు. నిబంధనలకు విరుద్ధంగా సమావేశం నిర్వహించారంటూ.. పంజాబ్ డైరెక్టర్లు మోహిత్ బుర్మాన్, నెస్ వాడియాపై చండీగఢ్ కోర్టులో పిటిషన్ వేశారు. నెస్ వాడియా మద్దతుతో మోహిత్ బర్మాన్ సమావేశాన్ని నిర్వహించారని ఆరోపించారు. డైరెక్టర్‌గా మునీశ్ ఖన్నా నియామకాన్ని వెంటనే నిలిపివేయాలని ప్రీతి తన పిటిషన్‌లో కోర్టును కోరారు. ఈ వ్యవహారంతో పంజాబ్ కింగ్స్ జట్టులోని లుకలుకలు బయటపడ్డాయి.…