రైతుల గురించి అనునిత్యం ఆలోచిస్తున్నారని అన్నారు మంత్రి రోజా. రాష్ట్రంలో ఎక్కడా పడితే అక్కడ సిగ్గు లేకుండా చంద్రబాబు బాదుడే బాదుడు అంటున్నారు. 14 ఏళ్ళు అధికారంలో 13 ఏళ్ళు ప్రతిపక్షంలో ఉన్న చంద్రబాబు రైతుల గురించి ఏ రోజైనా ఆలోచించారా? రైతు భరోసా లాంటి గొప్ప పథకం గురించి ఆలోచించారా? అని ప్రశ్నించారు రోజా. చంద్రబాబు అధికారంలో ఉండగా 92 శాతం రైతులను అప్పుల ఊబిలో ముంచారు. వ్యవసాయం దండగ అని పుస్తకం రాసింది చంద్రబాబు…