గత కొన్ని రోజులుగా అక్కినేని కోడలు సమంత, నాగచైతన్య మధ్య మనస్పర్ధలు, త్వరలోనే విడిపోతున్నారంటూ ప్రచారం అవుతోంది. ఈ రూమర్స్ కు అటు అక్కినేని ఫ్యామిలీ గాని, ఇటు సమంత గానీ క్లారిటీ ఇచ్చే ప్రయత్నం మాత్రం చేయలేదు. ఇటీవల కాలంలో సమంత ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ తాను ఈ విషయంపై స్పందించడానికి ఏమాత్రం సిద్ధంగా లేనని, తనకు నచ్చినప్పుడే చెప్పాలనుకున్న విషయాన్ని చెబుతానని తేల్చి చెప్పేసింది. ఈ విషయంపై టాలీవుడ్ లో ఇప్పుడు చర్చ నడుస్తోంది.…