Home
Ceasefire
Ceasefire News
-
Iran-US Ceasefire: గుడ్‌న్యూస్.. కాల్పుల విరమణకు అమెరికా-ఇరాన్ అంగీకారం?
Iran-US Ceasefire: అమెరికా, ఇరాన్ మధ్య పతాక స్థాయికి చేరిన ఉద్రిక్తతలకు త్వరలోనే తెరపడనున్నట్లు తెలుస్తోంది. రష్యన్ వార్తా సంస్థ RIA నోవోస్టి తెలిపిన వివరాల ప్రకారం.. ఇరు దేశాలు కాల్పుల విరమణ (సీజ్ఫైర్) ఒప్పందానికి సూత్రప్రాయంగా అంగీకరించాయి. పాకిస్తాన్ సైనిక అధికారులు, ఇరాన్ భద్రతా వర్గాలను ఉటంకిస్తూ ఈ సంచలన కథనాన్ని వెలువరించింది. ఈ ప్రతిపాదిత ఒప్పందంలో ప్రధానంగా 'స్ట్రెయిట్ ఆఫ్ హోర్ముజ్' (హోర్ముజ్ జలసంధి) ద్వారా నౌకల స్వేచ్ఛా రవాణాకు అనుమతించడం అత్యంత కీలకమైన… -
Donald Trump: ఇరాన్‌తో సీజ్ఫైర్ ముగిసింది, కానీ చర్చలు కొనసాగుతాయి..
Donald Trump: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇరాన్ చర్చలపై కీలక ప్రకటన చేశారు. అమెరికాతో చర్చలను ఇరాన్ కోరిందని, అయితే ఇరు దేశాల మధ్య కాల్పుల విరమణ ముగిసిపోయిందని స్పష్టం చేశారు. ట్రూత్ సోషల్ పోస్టులో ట్రంప్ ఈ ప్రకటన చేశారు. ‘‘ఇస్లామిక్ రిపబ్లిక్ ఆఫ్ ఇరాన్ మమ్మల్ని ‘చర్చలు’ కొనసాగించమని కోరింది. మేము అలా చేయడానికి అంగీకరించాము, కానీ కాల్పుల విరమణ ముగిసిందని యునైటెడ్ స్టేట్స్ వారికి స్పష్టంగా చెప్పింది’’ అని పోస్ట్ చేశారు.… -
Trump-Iran: ఇరాన్‌తో ఒప్పందం ముగిసింది.. ఇక దాడులే.. ట్రంప్ ప్రకటనతో మళ్లీ ఉద్రిక్తతలు
పశ్చిమాసియాలో మరోసారి రణరంగం జరిగే సూచనలు కనిపిస్తున్నాయి. కొద్దిరోజులు స్తబ్దతగా ఉన్న మధ్యప్రాచ్యం బుధవారం మరోసారి బాంబ్ దాడులతో దద్దరిల్లింది. మంగళవారం హార్ముజ్ జలసంధిలో నౌకపై ఇరాన్ దాడి చేసింది. దీంతో ప్రతీకారంగా ఇరాన్‌పై అమెరికా భీకర దాడులు చేసింది. దీంతో అమెరికా స్థావరాలే లక్ష్యంగా ఇరాన్ గల్ఫ్ దేశాలపై దాడులు చేసింది. దీంతో మరోసారి పశ్చిమాసియా దాడులతో రగిలిపోతుంది. -
Israel-Hezbollah: ఇజ్రాయెల్-హిజ్బుల్లా మధ్య కాల్పుల విరమణ ఒప్పందం! అమెరికా సంకేతాలు
ఇజ్రాయెల్-హిజ్బుల్లా మధ్య కాల్పుల విరమణ ఒప్పందం జరిగినట్లుగా అంతర్జాతీయ మీడియాలో కథనాలు వస్తున్నాయి. నేటి నుంచి కాల్పుల విరమణకు ఇజ్రాయెల్-హిజ్బుల్లా అంగీకరించాయని అమెరికాకు చెందిన ఒక అధికారి తెలిపారు. -
Israel-Iran: ఇరాన్ సీజ్‌ఫైర్‌పై ఇజ్రాయెల్ మౌనం.. సర్వత్రా ఉత్కంఠ!
ఇజ్రాయెల్‌పై దాడి చేయబోమని ఇరాన్ అధికారికంగా ప్రకటించింది. కాల్పుల విరమణ వెల్లడించింది. అయితే ఇరాన్ ప్రకటనపై ఇజ్రాయెల్ ఇప్పటి వరకు స్పందించలేదు. దాడులను ఆపాలంటూ అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఇరుదేశాలను కోరారు. -
Iran-Israel Ceasefire: ఇజ్రాయెల్‌తో కాల్పుల విరమణ ప్రకటించిన ఇరాన్.. మళ్లీ దాడులు చేస్తే మాత్రం..!
పశ్చిమాసియాలో నెలలుగా కొనసాగుతున్న ఉద్రిక్తతల మధ్య ఇరాన్ కీలక ప్రకటన చేసింది. ఇజ్రాయెల్‌పై కొనసాగిస్తున్న సైనిక చర్యలను నిలిపివేస్తున్నట్లు ప్రకటించింది. అయితే ఇదే సమయంలో ఇజ్రాయెల్ మళ్లీ దాడులకు దిగితే గతం కంటే మరింత తీవ్రమైన ప్రతిస్పందన ఉంటుందని గట్టిగా హెచ్చరించింది. -
US-Iran Talks: అమెరికా ఇరాన్ మధ్య మళ్లీ చర్చలు..? ఈసారి ఎక్కడంటే..?
US-Iran Talks: పాకిస్తాన్ రాజధాని ఇస్లామాబాద్ వేదికగా జరిగిన అమెరికా-ఇరాన్ శాంతి చర్చలు విఫలమయ్యాయి. దీంతో పరిస్థితి మళ్లీ మొదటికి వచ్చింది. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ‘‘హార్ముజ్ జలసంధి’’ని మూసేయడానికి యూఎస్ నేవీని దింపారు. ఈ నేపథ్యంలో పరిస్థితి మరింత జఠిలమైంది. అయితే, ఈ పరిస్థితుల్లో మళ్లీ చర్చలకు రెండు దేశాలు సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. అమెరికా, ఇరాన్ మధ్య 2 వారాల కాల్పుల విరమణ ఏప్రిల్ 21తో ముగుస్తోంది. ఈలోపే చర్చలు ప్రారంభం కానున్నట్లు తెలుస్తోంది.… -
UNSC Resolution: ట్రంప్ గాజా శాంతి ప్రణాళికకు UN ఆమోదం..
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ గాజా శాంతి ప్రణాళికకు ఐక్యరాజ్యసమితి భద్రతా మండలి నుంచి కీలకమైన ఆమోదం లభించింది. అమెరికా రూపొందించిన ముసాయిదా తీర్మానానికి ఓటింగ్‌లో మెజారిటీ మద్దతు లభించిన తర్వాత 20 పాయింట్ల రోడ్‌మ్యాప్ ఇప్పుడు అంతర్జాతీయంగా ఆమోదం పొందిన శాంతి చట్రంగా మారింది. ఈ ప్రతిపాదనలో అంతర్జాతీయ దళాలను మోహరించడం కూడా ఉంది. వాషింగ్టన్ 20-పాయింట్ల చట్రం గాజాలో కాల్పుల విరమణ, పునర్నిర్మాణం, పాలన కోసం మొదటి సమగ్ర అంతర్జాతీయ రోడ్‌మ్యాప్‌ను వివరిస్తుంది. Also… -
Pakistan: భారత్ మాపై రెండు వైపులా యుద్ధం చేస్తోంది.. పాక్ రక్షణ మంత్రి వ్యాఖ్యలు..
Pakistan: పాకిస్తాన్ రక్షణ మంత్రి ఖవాజా ఆసిఫ్ మరోసారి భారత్‌పై అక్కసు వెళ్లగక్కాడు. భారతదేశం పాకిస్తాన్‌పై ద్విముఖ పోరు చేస్తుందని ఆరోపించారు. రెండు సరిహద్దుల్లో యుద్ధం చేయడానికి ఆఫ్ఘనిస్తాన్‌ను భారత్ ప్రాక్సీగా ఉపయోగించుకుంటుందని ఆయన అన్నారు. -
Afghan-Pak War: ఆఫ్ఘాన్ ముందు పాకిస్తాన్ సరెండర్.. 48 గంటల కాల్పుల విరమణ..
Afghan-Pak War: ఆఫ్ఘనిస్తాన్, పాకిస్తాన్ల మధ్య గత కొన్ని రోజులుగా తీవ్ర ఉద్రికత కొనసాగుతోంది. రెండు దేశాలు సరిహద్దుల వద్ద తీవ్రమైన కాల్పులు జరిపాయి. ఈ దాడుల్లో ఇరు వైపుల పదుల సంఖ్యలో సైనికులు మరణించారు. ఇదిలా ఉంటే, రెండు దేశాల మధ్య 48 గంటల పాటు ‘‘కాల్పుల విరమణ’’ ఒప్పందం కుదిరింది.
తాజావార్తలు
-
Off The Record: తెలంగాణ మహిళా శిశు సంక్షేమ శాఖలో కాంట్రాక్టర్స్ రాజ్యం..!
-
Honda CB500 Launched in India: రాయల్ ఎన్ఫీల్డ్కు పోటీ..! హోండా CB500 విడుదల.. ధర, ఫీచర్లు ఇవే..
-
iQOO Z11 Lite 5G: 6500mAh బ్యాటరీ, 44W ఫాస్ట్ ఛార్జింగ్, IP65 రేటింగ్.. iQOO నుంచి కొత్త ఫోన్ లాంచ్..
-
Off The Record : రేపల్లెలో వైసీపీ కోవర్ట్ పాలిటిక్స్? మోపిదేవి సస్పెన్షన్ వెనుక కథేంటి?
-
AP Local Body Elections: స్థానిక ఎన్నికలకు మరో ముందడుగు..
ట్రెండింగ్
-
మిలిటరీ గ్రేడ్ బాడీ, 120Hz డిస్ప్లే, 7,000mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో OnePlus N6 Lite.. ధర ఎంతంటే?
-
Team India History: భారత్ @ 200.. టీ20ల్లో తొలి జట్టుగా భారత్ వరల్డ్ రికార్డ్!
-
1.5K 144Hz OLED డిస్ప్లే, 7200mAh బ్యాటరీతో అక్టోబర్ 6న రాబోతున్న VIVO V80..!
-
India Win Gold Medal: ఆసియా క్రీడలు 2026 మహిళా క్రికెట్ విజేతగా టీమిండియా..! స్వర్ణ పతకం కైవసం..
-
Asian Games 2026 Final: శ్రీలంక బౌలర్లపై స్మృతి మంధాన శివతాండవం.. లంక ముందు భారీ టార్గెట్.!