2024లో మరోసారి అధికారంలోకి వచ్చిన 9 నెలలకు తమ పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు పార్టీ వ్యవహారాలపై సీరియస్‌గా దృష్టి పెట్టినట్టు కనిపిస్తోందని అంటున్నారు తెలుగుదేశం నాయకులు. ఇన్నాళ్ళు ప్రభుత్వ పరంగా పాలనా వ్యవహారాల్లో మునిగితేలిన బాబు... ఇప్పుడిప్పుడే పార్టీ మీద దృష్టిపెట్టినట్టు కనిపిస్తోందని అంటున్నారు. అదే సమయంలో.. ఇంతకు ముందులా స్వీట్ వార్నింగ్స్ కాకుండా... ఘాటు హెచ్చరికలు వెళ్ళడంతో...ఒక్కసారిగా టాప్ టు బాటమ్ పార్టీ అటెన్షన్‌లోకి వచ్చినట్టు తెలుస్తోంది.