అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఈనెల 8న మంగళవారం నాడు మహిళా ఉద్యోగులకు ప్రభుత్వం ప్రత్యేకంగా క్యాజువల్ లీవ్‌ను ప్రకటించింది. ఈ మేరకు సీఎస్ సమీర్ శర్మ జీవో జారీ చేశారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా ఈ నెల 8న విజయవాడలో జరగనున్న రాష్ట్ర స్థాయి మహిళా సదస్సును పండుగలా జరుపుకోవాలని వైసీపీ మహిళా విభాగం రాష్ట్ర అధ్యక్షురాలు, ఎమ్మెల్యే రోజా అన్నారు. ఆర్థిక, సామాజిక, రాజకీయ రంగాల్లో…