హుజురాబాద్‌లో కుల సంఘాలకు ఒక్కసారిగా డిమాండ్ పెరిగిందా? వారు ఏం అడిగితే దానికి ఓకే చెప్పేస్తున్నారా? హామీల వర్షం కురుస్తోందా? ఈ విషయంలో అధికారపార్టీ తీసుకుంటున్న జాగ్రత్తలేంటి? రాజకీయవర్గాల్లో జరుగుతున్న చర్చేంటి? ఒక్కోరోజు నలుగురు లేదా ఐదుగురు మంత్రుల ప్రచారం! హుజురాబాద్ ఉపఎన్నిక తేదీ ప్రకటన ఇప్పట్లో లేకపోయినా.. ఎప్పటికప్పుడు వ్యూహాలు మార్చుకోవడానికి పార్టీలకు బోల్డంత సమయం చిక్కింది. ఈ టైమ్‌ను అధికారపార్టీ టీఆర్‌ఎస్ చక్కగా ఉపయోగించుకుంటోందట. హుజురాబాద్ ఉపఎన్నిక తమకు పెద్ద విషయమే కాదని స్టేట్‌మెంట్లు…