ఇప్పుడు పిల్లల జీవితంలో గడియారం ముల్లు చాలా వేగంగా తిరుగుతోంది. 16ఏళ్ల వయసులో ఒక నిర్ణయం తీసుకుని 30 ఏళ్ల వరకు దానితోనే జీవించాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఇంకా స్కూల్ చదువు పూర్తి కాకముందే భవిష్యత్తు డెడ్‌లైన్‌లు మొదలవుతున్నాయి. ఏ స్ట్రీమ్ తీసుకోవాలి, ఏ కోర్సు ఎంచుకోవాలి, ఏ జాబ్ మార్కెట్‌లో నిలబడాలన్న ప్రశ్నలు టీనేజ్ వయసులోనే భుజాల మీద పడుతున్నాయి. బయట నుంచి చూస్తే ఇదంతా అవకాశాల ప్రపంచంలా కనిపిస్తుంది. ఏఐ ఉంది, టెక్నాలజీ ఉంది,…